• కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్
• నేడు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం
నవతెలంగాణ -పెద్దవంగర
ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ అన్నారు. మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. శంకర కంటి ఆసుపత్రి హైదరాబాద్ సహకారంతో, హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేడు పాలకుర్తి మండల కేంద్రంలోని బాషారత్ ఫంక్షన్ హాల్ లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇలాంటి వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కంటి పరీక్షలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు కళ్లను పరీక్షించుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో ఉచిత బోజన వసతి తో పాటుగా కంటి పరీక్షలు నిర్వహించి, ఆపరేషన్ చేసి (ఐఓఎల్) అమస్తారని పేర్కొన్నారు. కంటి వైద్య పరీక్షల కోసం ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, జిరాక్స్ పత్రాలు, ఫోన్ నెంబర్ తీసుకురావాలని కోరారు.
కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



