మద్దతు తెలిపిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సంఘ అధ్యక్షులు కడారు రమేష్ బాబు అధ్యక్షతన, బొమ్మ కంటి బాలరాజు ప్రధాన కార్యదర్శిగారి ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ రిలే నిరాహరదీక్ష లు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్చి 2024 అనంతరం ఉద్యోగ విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగుల బిల్లుల బకాయిలు వెంటనే చెల్లించాలని, ఈ హెచ్ ఎస్ కార్డులు అన్ని కార్పోరేట్ హాస్పిటల్స్ లో చెల్లుబాటు కావాలని, వైద్య బిల్లులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం యాదాద్రి కలెక్టరేట్లో ఏవోసి జగన్మోహన్ ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.
ఈ నిరాహార దీక్షకు రాష్ట్ర జేఏసీ వైస్ ప్రెసిడెంట్ మందడి ఉపేందర్ రెడ్డి, టీఎస్ యుటిఎఫ్ అధ్యక్షులు ముక్కెర్ల యాదయ్య, డిటిఎప్ అధ్యక్షులు ఎం.సత్తయ్య పలు సంఘాల నాయకులు మద్దతుగా మాట్లాడారు. ఈ రిలే నిరాహార దీక్ష లో సంఘ రాష్ట్ర కమిటి సభ్యులు జిట్టా భాస్కర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం బాలేశ్వర్, యస్ సుధాకర్ రెడ్డి, శ్రవణ్ కుమార్, వై బుగ్గయ్య , జిట్టా యాదిరెడ్డి, బిఅంబేద్కర్, మాట్లాడారుజి జయమ్మ, యస్. రాజారాం, జి జగన్మోహన్, జి లక్ష్మీనారాయణ, ముత్తయ్య, జిట్టా మాదిరెడ్డి, బుర్రా ఆంజనేయలు, పి ఎలియాస్, ఆర్ మల్లయ్యలు పాల్గొన్నారు.



