యూవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాపు యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు రూ.2500 ఇవ్వాలని యూవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాపు యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం మండలం కొయ్యురులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలో భాగంగా మహాలక్ష్మి పథకంలో మహిళలకు నెలకు రూ.2500, ఉపాది కూలీలకు రూ.12 వేలు ఇవ్వాలని అన్నారు. రెండు సంవత్సరాలు గడుస్తున్న కుడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వాపోయారు.ఇప్పకైనా రెండు సంవత్సరాల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.అసంఘటిత కార్మికుల సమస్యలతో వివిధ కార్మికుల యొక్క సమస్యలను వెంటనే పరిష్కారించాలి.ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని పక్షం లో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రజలందరిని కలుపుకొని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మేడిపల్లి సందీప్, శనిగరం సుఖక్క, శనిగరం సమ్మక్క, మరుపాక నగేష్, రాజయ్య, లక్ష్మి, పోసక్కా, పాల్గొన్నారు.
ప్రభుత్వం మహిళలకు రూ.2500 ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



