Tuesday, November 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్9 మంది గంజాయి నిందితుల అరెస్ట్

9 మంది గంజాయి నిందితుల అరెస్ట్

- Advertisement -

1.1కిలోల ఎండు గంజాయి స్వాదీనం
నవతెలంగాణ – మిర్యాలగూడ 

అక్రమ గంజాయి రవాణా చేస్తున్న 9 మంది అంతరాష్ట్ర గంజాయి నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్రాజు తెలిపారు. మంగళవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఏపీ రాష్ట్రంలోని మాచర్లకు చెందిన ఇప్పటోళ్ల అమరలింగం, మిర్యాలగూడ పట్టణానికి చెందిన మహ్మమద్ జునైద్లీ, మహమ్మద్ గౌస్, షేక్ జావిద్, బొడ్డు శ్యామ్, పులిజాల లక్ష్మీనారాయణ, నాశబోయిన గణేష్, బొమ్మాజి గౌతమ్నంద, మహమ్మద్ తాజొద్దిన్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుంగా ఎన్ఎస్పీ క్యాంప్ లోని కళాభారతి నిర్మానుష్య ప్రదేశంలో అనుమానస్పదంగా కొందరు వ్యక్తులు ఉండగా పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకోని విచారించగా గంజాయి కలిగి ఉండి క్రయవిక్రయాలు చేస్తున్నట్లు తేలిందని చెప్పారు. వీరి వద్ద 1.1కిలోల ఎండు గంజాయి ప్యాకెట్లు, నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.940 నగదును స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐలు నాగభూషణం, సోమనర్సయ్య, ఎస్ఐలు రాంబాబు, సైదిరెడ్డిలు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -