నవతెలంగాణ – జుక్కల్
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తెలిపారు. మంగళవారం రోజు జుక్కల్ నియోజకవర్గ కేంద్రంలోని జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్భార్ కార్యక్రమాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు నిర్వహించారు. పలు సమస్యలతో వచ్చిన ప్రజల దగ్గర నుండి అర్జీలు స్వీకరించి వారి యొక్క సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించడం జరిగింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నియోజకవర్గంలో ప్రజలు వివిధ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేసి వారి సమస్యలను తెలుసుకొని తక్షణమే పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తున్నామన్నారు. అదేవిధంగా జుక్కల్ మండలానికి సంబంధించిన పలు గ్రామాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్భార్: ఎమ్మెల్యే తోట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



