Tuesday, November 11, 2025
E-PAPER
Homeజిల్లాలుఆయిల్ ఫామ్ సాగు చేస్తే అధిక లాభాలు

ఆయిల్ ఫామ్ సాగు చేస్తే అధిక లాభాలు

- Advertisement -

మిర్యాలగూడ ప్రాథమిక సహకార సంఘంలో అవగాహన సదస్సు
నవతెలంగాణ మిర్యాలగూడ 

ఆయిల్ ఫామ్ సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయని క్లస్టర్ ఆర్టికల్చర్ ఆఫీసర్ షేక్ నసీమా అన్నారు. మంగళవారం స్థానిక మిర్యాలగూడ ప్రాథమిక సహకార సంఘంలో అవగాహన సదస్సు నిర్వహించారు.  ప్రభుత్వం అందించే సబ్సిడీ, సహకారం, ప్రోత్సాహకo, ఆదాయం, ఇతర వివరాలను వివరించారు. ప్రతి సహకార సంఘంలో సుమారుగా 100 ఎకరాలలో పంట సాగు చేయాలని లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. ప్రస్తుతం మిర్యాలగూడ డివిజన్లో 750 ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంట సాగు అవుతుందని, మిర్యాలగూడ మండలంలో 142 ఎకరాలలో పంట సాగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఈ పంట కోసం అవసరమైన మొక్కలను ఎకరానికి 57 మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ అందిస్తుందని తెలిపారు.

నాలుగు సంవత్సరాల పాటు ఎకరానికి 4200 రూపాయలు చొప్పున ప్రోత్సాహకం రైతుల ఖాతాలో నేరుగా జమవుతుందన్నారు. ఇందులో 2100 ఆయిల్ ఫామ్ సాగు కోసం, అంతర్ పంటల సాగుతూ 2100 ప్రోత్సాహకం అందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు మొదటి మూడు సంవత్సరాల నుండి ఆదాయం మొదలవుతుందని 30 సంవత్సరాల వరకు అధిక లాభాలు పొందవచ్చని చెప్పారు. అంతర్ పంటలైన మిర్చి, టమాటా, మునగ, కూరగాయలు పంటలను సాగు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ ఇన్చార్జి సీఈఓ సతీష్, ఫీల్డ్ ఆఫీసర్ రజిత,ఆయిల్ ఫామ్ ఫీల్డ్ అసిస్టెంట్ మంజునాథ్, ఏఈఓ రమేష్, రైతులు గొంగడి సైదిరెడ్డి, శ్రీనయ్య, మల్లయ్య, నక్క రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -