- Advertisement -
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
ఈనెల 7వ తేదీ నుంచి నుంచి 9 వరకు నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన అండర్ 17 పాఠశాల ఎస్ జి ఎఫ్ బాలికల విభాగంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించిన విషయం తెలిసిందే. ఇందులో జిల్లా కేంద్రంలోని రిసోనెన్స్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న నడిమెల సహస్ర రావు బంగారు పతకం సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ ప్రమోద్ రెడ్డి వ్యాయమ ఉపాధ్యాయులు వినోద్ పెంటన్న స్వర్ణలత తెలిపారు. మంగళవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించిన సహస్రను శాలువాతో పాటు ఘనంగా సత్కరించారు భవిష్యత్తులను పాఠశాలలో చదువుతోపాటు క్రీడలకు పెద్దపీట వేయడం జరుగుతుందని కరస్పాండెంట్ ప్రమోద్ రెడ్డి తెలిపారు.
- Advertisement -



