Wednesday, November 12, 2025
E-PAPER
Homeమానవిఈ జాగ్రత్తలు పాటిద్దాం..

ఈ జాగ్రత్తలు పాటిద్దాం..

- Advertisement -

వర్షాకాలం నుంచి చలికాలానికి మారే సమయంలో శరీరం ఇబ్బంది పడుతుంది. ఉన్నట్టుండి వాతావరణం మారడంతో జలుబు, ఫ్లూ వంటివి వస్తాయి. దీంతో పాటు ఉష్ణోగ్రత, తేమలో మార్పు కారణంగా బ్యాక్టీరియా, వైరస్‌ వ్యాప్తి ఎక్కువై ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.
అయితే, వాతావరణంలో మార్పులు చెవి (జుaతీ) ఇన్‌ఫెక్షన్‌ ముప్పును పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. చెవుల్లోకి గాలి చొరబడి చెవి నొప్పి, స్వల్పంగా వినికిడి సమస్యలకు దారితీస్తుందని వివరిస్తున్నారు. మరి, ఇలా ఎందుకు జరుగుతుంది? వాతావరణ మార్పుల వల్ల కలిగే చెవి ఇన్‌ఫెక్షన్లకు ఎలా చెక్‌ పెట్టాలో తెలుసుకుందాం.
చలికాలంలో తేమ కారణంగా జలుబు, దగ్గు, ఫ్లూ, ముక్కు దిబ్బడతో పాటుగా చెవుల్లో వైరస్‌, బ్యాక్టీరియా చేరి అసౌకర్యంతోపాటు నొప్పి రావడం కామన్‌.
చెవి ఇన్‌ఫెక్షన్‌ ప్రారంభ లక్షణాల్లో తరచుగా తేలికపాటి నొప్పి, రింగింగ్‌ శబ్దాలు, వినికిడిలో ఇబ్బందులు, నీటి స్రావం ఉంటాయి. పిల్లలు, వృద్ధులు, బలహీన రోగనిరోధక శక్తి ఉన్న వారిలో ఇవి మరింత ఎక్కువగా ఉంటాయి. దీంతో కొందరు తీవ్రమైన నొప్పి, తల తిరగడం, చెవిలో నిరంతరం భారంగా ఉన్నట్లు ఫీలవుతుంటారు.
మరోవైపు, ఇన్ఫెక్షన్లతో పాటు, వాతావరణ హెచ్చుతగ్గులు చెవిలో గులిమి పేరుకుపోయేలా చేస్తుంది. ముఖ్యంగా బైక్‌ నడుపుతున్నప్పుడు చెవులను నేరుగా తాకే చల్లని గాలులు చికాకును కలిగిస్తాయి. గొంతు ఇన్ఫెక్షన్లు కూడా చెవి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.
ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పుల నుంచి చెవులను రక్షించుకోవడం చాలా ముఖ్యం. బైక్‌ నడుపుతున్నప్పుడు ఎల్లప్పుడూ మీ చెవులను కవర్‌ చేసుకోవాలి. చల్లని గాలి చెవిలోనికి వెళ్లకుండా అడ్డుకునే వాటిని ధరించాలి. సాధారణ జలుబు, దగ్గు లక్షణాలను లైట్‌గా తీసుకోవద్దు. వీటిని సకాలంలో ట్రీట్‌ చేయకపోతే చెవి ఇన్‌ఫెక్షన్లను తీవ్రతరం చేస్తాయి.
చెవుల్లో పేరుకుపోయిన గులిమి వల్ల అసౌకర్యం కలుగుతుంది. అయితే, ఈ గులిమిని తొలగించడానికి కాటన్‌ బడ్స్‌ని అతిగా వాడకూడదు. వీటిని చెవి లోపలి వరకు చొప్పించడం వల్ల సున్నితమైన భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇది చికాకుని కలిగించడమే గాక, కొన్నిసార్లు గాయానికి దారితీస్తుంది. అందుకే, సమస్య ఉంటే వైద్యుడు సిఫార్సు చేసిన ఇయర్‌ డ్రాప్స్‌, మందులను కోర్సు పూర్తయ్యే వరకు వాడాలి. స్నానం చేసేటప్పుడు వీలైనంత మేరకు చెవులు తడవకుండా చూసుకోవాలి. లోపలికి నీరు వెళ్తే ఇన్‌ఫెక్షన్‌ మరింతగా పెరిగే ప్రమాదం ఉంది.
చెవి నొప్పి నుంచి రిలీఫ్‌ పొందడానికి హైడ్రేటెడ్‌గా ఉండటం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, వెచ్చని కంప్రెస్‌ వాడటం వంటివి చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -