Wednesday, November 12, 2025
E-PAPER
Homeఆటలుహైదరాబాద్‌కు 3 పాయింట్లు

హైదరాబాద్‌కు 3 పాయింట్లు

- Advertisement -

రాజస్తాన్‌తో రంజీ మ్యాచ్‌ డ్రా
నవతెలంగాణ-హైదరాబాద్‌ :
రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-డిలో హైదరాబాద్‌ ముచ్చటగా మూడో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఉప్పల్‌ స్టేడియంలో నాలుగు రోజుల పాటు జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో ఆతిథ్య హైదరాబాద్‌ 3 పాయింట్లు దక్కించుకోగా.. రాజస్తాన్‌ ఓ పాయింట్‌ సాధించింది. 340 పరుగుల లక్ష్యంతో మంగళవారం ఉదయం బ్యాటింగ్‌కు వచ్చిన రాజస్తాన్‌.. 57 ఓవర్లలో 207/3 పరుగులు చేసింది. సచిన్‌ యాదవ్‌ (44, 57 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), సల్మాన్‌ ఖాన్‌ (79, 138 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మహిపాల్‌ లామ్రోర్‌ (40, 93 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. ఓపెనర్లు దూకుడుగా ఆడినా.. టీ విరామం తర్వాత వరుస వికెట్లు పడగొట్టిన హైదరాబాద్‌ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. మరో గంట ఆట మిగిలి ఉండగానే ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. హైదరాబాద్‌ వరుసగా 364/10, 244/9 పరుగులు చేయగా.. రాజస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 269/10 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో రాణించిన రాహుల్‌ రాదేశ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -