Wednesday, November 12, 2025
E-PAPER
Homeజాతీయంఓటెత్తిన బీహార్‌

ఓటెత్తిన బీహార్‌

- Advertisement -

రెండోవిడతలో 67.14 శాతం పోలింగ్‌
రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఓటింగ్‌
పాట్నా:
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు ఓటర్లు పోటెత్తారు. 20 జిల్లాల పరిధిలోని 122 స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరగగా.. ఈ విడతలో 3.7 కోట్ల మంది ఓటర్లకు గాను.. పోలింగ్‌ ముగిసే సమయానికి రికార్డు స్థాయిలో 67.14శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
తొలి విడతలోనూ 65.9 శాతం భారీ పోలింగ్‌ నమోదైన విషయం తెలిసిందే. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే ఈసారి అత్యధిక శాతం పోలింగ్‌ నమోదైనట్టు సమాచారం. 2000లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 62.57 శాతం ఓటింగ్‌ నమోదు కాగా.. ఇప్పటివరకు ఇదే గరిష్టం కావటం విశేషం. లోక్‌సభ ఎన్నికల విషయానికొస్తే.. 1998లో అత్యధికంగా 64.6శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక సర్వేల ఫలితాలు వస్తున్నా.. కొన్ని సందర్భాల్లో ఆ ఫలితాలు తారుమారైన విషయం తెలిసిందే. కాగా ఎన్నికల ఫలితాలు నవంబర్‌ 14న వెల్లడికానున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -