Friday, May 16, 2025
Homeజిల్లాలు17న కామారెడ్డిలో జాబ్ మేళా..!

17న కామారెడ్డిలో జాబ్ మేళా..!

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రయివేట్ రంగములో ఉద్యోగములు కలిపించేందుకు ఈ నెల 17న జాబ్ మేళా ఉంటుంది. ఈ విషయాన్ని జిల్లా ఉపాది కల్పనాదికారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని మొదటి అంతస్తులో గల రూమ్ నెంబర్ 121 లో ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కామారెడ్డి లో ని ప్రముఖ కంపెనీ అయినా వరుణ్ మోటార్స్ రిలేషన్మే నేజర్ ఈ పోస్ట్ కు  విద్య హర్వతలు ( ఏదైనా డిగ్రీ, మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ బీటెక్, డిప్లమా )  నిరుద్యోగ యువకులు అర్హులు వయస్సు 18 సంవస్సరా ల నుండి 30 సంవస్సరా లోపు  ఉండవలెను. ఈ జాబ్ ఇంటర్వ్యూ కు హాజరు అయ్యే నిరుద్యోగులు వారి బయో డేటా తో పాటు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధర్ కార్డు ఫోటోలతో హాజరు కావాలని సూచించారు. మరింత సమాచారం. కోసం 9885453222, 7671974009, ఫోన్ నంబర్లను సంప్రదించలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -