Wednesday, November 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటనను ఖండిస్తున్నాం

ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటనను ఖండిస్తున్నాం

- Advertisement -

కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం : సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

దేశాన్ని దిగ్భ్రాంత్రికి గురిచేసిన ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు ఘటనను సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని పేర్కొంది. మంగళవారం ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ఘటనలో 13 మంది చనిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. మృతులకు సంతాపాన్ని, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘కేంద్రంలోనూ, ఢిల్లీలోనూ బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. కేంద్ర నిఘా సంస్ధలు ఆ ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేస్తున్నాయి. ఈ ఘటన జరగడానికి కేంద్ర ప్రభుత్వం, నిఘా సంస్ధల వైఫల్యమే కారణం. ఈ పేలుళ్లకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఘటనపై వెంటనే అత్యున్నత స్ధాయి దర్యాప్తు చేయాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -