నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రముఖ కవి అందెశ్రీకి హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ ఘన నివాళులర్పించింది. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సంతాప సభలో… తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలను వక్తలు కొనియాడారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఏ విధమైన సాహితీ నేపథ్యం లేకుండానే తనలోని అపారమైన ప్రతిభతో అగ్రశ్రేణి కవుల్లో ఒకరిగా ఎదిగారని పేర్కొన్నారు. స్వరాష్ట్ర ఉద్యమానికి ఆయన రాసిన పాట లు ప్రేరణగా నిలిచాయని అన్నారు. తెలంగాణ గ్రామీణ జీవితం, యాస, సంస్కృతికి ఆయన రచనలు ప్రతీకలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర గీత రచన ద్వారా అందెశ్రీ చరిత్రలో నిలిచారన్నారు. ఆయన మృతి భవిష్యత్ తరానికి తీరని లోటని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి వాసు, వైస్ ప్రెసిడెంట్ శోభన్, ట్రెజరర్ నారాయణరెడ్డి, కమిటీ సభ్యులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అందె శ్రీకి హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఘన నివాళి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



