Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా సమస్యలపై పిఎన్ఎం పోరు కళాబాట చేపట్టాలి

ప్రజా సమస్యలపై పిఎన్ఎం పోరు కళాబాట చేపట్టాలి

- Advertisement -
  • – డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవి నాయక్ 
    నవతెలంగాణ – మిర్యాలగూడ 
    : ప్రజా సమస్యలపై ప్రజా నాట్య మండలి పోరు కళా బాట సాగించాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవి నాయక్ అన్నారు. బుధవారం స్థానిక పిఎన్ఎం కార్యాలయంలో మండల 3 వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తునదని ఆరోపించారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి రాజకీయ ప్రయోజనాల కోసం  పాకులాడుతున్నారని విమర్శించారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలపై కళాకారులు పిఎన్ఎం ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకోవాలని కోరారు. సంఘాన్ని బలోపేతంకు పాటుపడాలని సూచించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా కుమ్మరి సైదులు, కార్యదర్శిగా యదసీ చిరంజీవిలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పిఎన్ఎం జిల్లా సహాయ కార్యదర్శి పుట్టల సైదులు, జిల్లా కమిటీ సభ్యులు పోలేని నగేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -