Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జోగిపేటలో వృద్దురాలి మెడలోంచి 4 తులాల బంగారం అపహరణ

జోగిపేటలో వృద్దురాలి మెడలోంచి 4 తులాల బంగారం అపహరణ

- Advertisement -

నవతెలంగాణ- జోగిపేట
జోగిపేటలోని సత్యసాయి కాలనీలో ఓ ఇంట్లోకి ప్రవేశించి వృద్ధురాలి కంట్లో కారం చల్లి ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును చైన్ స్నాచర్ ఎత్తుకెళ్లిన సంఘటన బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. శంకరంపేట మానెమ్మ అనే వృద్ధురాలు తన కూతురు వెంకటలక్ష్మి ఇంట్లో నివాసం ఉంటుంది. తల్లి కూతుర్లు ఇంట్లో ఉన్న సమయంలోనే ఇంట్లోకి ఓ దుండగుడు ప్రవేశించి మృదురాలి కంట్లో కారం చల్లి దోచుకెళ్ళారు. అడ్డుకోబోయిన వారిని తప్పించుకొని పారిపోయారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాసేపటటికి వృద్దురాలి ఇంటికి చేరుకున్న పోలీసులు జోగిపేట సిఐ అనిల్ కుమార్, ఎస్సై పాండులు విచారణ చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -