నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
కల్వకుర్తి మండలంలోని మహాత్మ జ్యోతిబా పూలే బిసి గురుకుల పాఠశాలలో రెండవ రోజు క్రీడలు ఉత్సాహంగా కొనసాగాయి. బుధవారం ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలనీ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 16 ఎం జె పి బాలికల గురుకుల పాఠశాలలో, 8 కళాశాలల నుంచి దాదాపు 560 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అండర్ 14 & 16 విభాగాలలో క్రీడాకారులకు పలు పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమణి తెలిపారు.
ఆమె మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే క్రీడల్లో పాల్గొనడం వల్ల పోటీతత్వం పెరుగుతుందని ప్రిన్సిపల్ క్రీడాకారిణిలు సూచించారు. క్రీడాభ్యాసం ద్వారా క్రీడాకారుల ఆత్మవిశ్వాసాన్ని పెంచి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎం జె పి పీడి సింధుజ, ఉమ్మడి జిల్లా వివిధ మండలాల నుంచి విచ్చేసిన పీడీలు, పిఇటీలు, ఇంచార్జ్ టీచర్లు క్రీడాకారిణిలు పాల్గొన్నారు.



