నవతెలంగాణ – తుంగతుర్తి
రబీ సీజన్‌కు యూరియా కొరత లేదని,రైతులకు ఎరువులు అందేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటుందని ఏడీఏ రమేష్ బాబు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి మాట్లాడారు. ఈ మేరకు వచ్చే రబీ సీజన్ కోసం 120 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాల్లో స్టాక్ రికార్డులను, లైసెన్సులను పరిశీలించారు. ఎరువుల వివరాలను ప్రత్యేక యాప్ లో నమోదు చేసి, పిఓఎస్ మిషన్ ద్వారానే విక్రయించాలని,రైతు ఆధార్ కార్డు తీసుకొని, పూర్తి వివరాలు నమోదు చేశాకే.. ఎరువులు విక్రయించాలని, ప్రతి రైతుకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని సూచించారు. కల్తీ విత్తనాలు,ఎరువులు విక్రయిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతులకు అందుబాటులోనే యూరియా- ఏడిఏ రమేష్ బాబు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



