- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని వల్లెంకుంట ఎస్సీ కాలనీలో కొన్ని నెలలుగా మిషన్ భగీరథ నీరు పైప్ లైన్ లీకేజై నీరు వృధాగా పోతున్నా.. సంబంధించిన అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. లికేజీలను సరిచేసి,తాగునీరు అందించాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. లీకేజి వల్ల రోడ్డుపై భారీ గుంత ఏర్పడి వాహనదారులు ప్రమాదాల బారిన పడి గాయాల పాలవుతున్నారని, లీకేజి వాటర్ సమీప పంట పొలాల్లో కి చేరి పంట నాశనం అవుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధించిన ఉన్నతాధికారులు స్పందించి పైప్ లైన్ లీకేజి సరి చేసి రోడ్ పై ఏర్పడిన గుంత ని పూడ్చి వేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
- Advertisement -



