Wednesday, November 12, 2025
E-PAPER
Homeకరీంనగర్అద్దె కట్టలేక రోడ్డున పడిన కుటుంబం..

అద్దె కట్టలేక రోడ్డున పడిన కుటుంబం..

- Advertisement -

ప్రభుత్వ విప్, ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి..
నవతెలంగాణ – వేములవాడ

ఇంటికి అద్దె కట్టలేక ఓ కుటుంబం రోడ్డున పడింది. వేములవాడ పట్టణంలో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక సంఘటన స్థానికులను కలచివేస్తోంది. కనీసం తలదాచుకునే చోటు లేక మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆశ్రయం పొందిన ఆ తల్లి–కూతుళ్ల కష్టం అందరి మనసును కదిలిస్తోంది.వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామానికి చెందిన రామిని వరలక్ష్మి, ఆమె కూతురు మానసలు గత కొంతకాలంగా పట్టణంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ బట్టల దుకాణంలో పని చేసేవారు. అయితే ఇటీవల ఉద్యోగం కోల్పోవడంతో ఆదాయం నిలిచిపోయింది. అద్దె చెల్లించలేకపోవడంతో ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమని చెప్పడంతో బుధవారం వీరు రోడ్డున పడ్డారు.తమ వద్ద తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు అంటూ కన్నీళ్లు కారుస్తూ వరలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం మాకు కనీసం ఒక ఇల్లు, జీవనోపాధి కల్పించాలి. కూతురితో ఎక్కడికెళ్దామో తెలియడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుస్థితిలో ఉన్న కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సాయం చేయాలి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్  ముందుకు వచ్చి ఆదుకోవాలి అని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -