Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మిర్యాలగూడ పోస్ట్ఆఫీస్ లో ఏటిఎం సదుపాయం..

మిర్యాలగూడ పోస్ట్ఆఫీస్ లో ఏటిఎం సదుపాయం..

- Advertisement -

నవతెలంగాణ – మిర్యాలగూడ 
మిర్యాలగూడ హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఏటిఎం సదుపాయం ఉన్నదని పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్ బాణావత్ ప్రతాప్ నాయక్ తెలిపారు. బుధవారం స్థానిక పోస్ట్ ఆఫీస్ లో విలేకర్లతో మాట్లాడుతూ పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులు, వివిధ బ్యాంకులా ఖాతదారులు ఏటిఎంను సద్వినియోగం చేసుకోవచ్చని సూచించారు. ఇతర బ్యాంకుల ఏటిఎం ఏ విధంగా ఉపయోగపడుతుందో పోస్ట్ ఆఫీస్ ఏటిఎం కూడా అదేవిదంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఏటిఎం కార్డును బట్టి రోజుకు రూ.20,000 నుండి రూ.40,000 వరకు డబ్బులు తీసుకోవచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని మిర్యాలగూడ  పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -