- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నల్గొండ మెడికల్ కాలేజీలో మరోసారి ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ఫస్టియర్ విద్యార్థులు సీనియర్లు తమను ర్యాగింగ్ చేశారని ఫిర్యాదు చేయగా, కాలేజీ ప్రిన్సిపాల్ ‘ర్యాగింగ్ సహజమే, వచ్చే ఏడాది మీరు కూడా సీనియర్లు అవుతారు’ అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఫిర్యాదు చేసిన విద్యార్థులను సీనియర్లు మళ్లీ బెదిరింపులకు గురి చేశారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -



