Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల క్యాంపస్‌ ను సందర్శించిన కలెక్టర్ 

నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల క్యాంపస్‌ ను సందర్శించిన కలెక్టర్ 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
జిల్లా కేంద్రం లోని దేవునిపల్లిలో నూతనంగా నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల క్యాంపస్‌ను జిల్లా కలెక్టర్ సందర్శించి, నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజి మొత్తం కలియ తిరుగుతూ ప్రధాన కళాశాల భవనం, బాలికల హాస్టల్, బాలుర హాస్టల్, డైనింగ్ హాల్ భవనాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతిపై, వైద్య కళాశాలకు కావలసిన మంచి నీటి వసతి గురించి మిషన్ భగీరథ నీటి కోసం మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మార్చి లోగా  నాణ్యతతో కూడిన నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్  వెంట అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్ అండ్ బి ఈ ఈ  మోహన్ , మునిసిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -