Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..

రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..

- Advertisement -

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ శాయంపేట 
రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలం లోని వివిధ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అదేవిధంగా కల్యాణ లక్ష్మి సిఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలను రైతులకు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలు జరిగిన అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు. రైతులకు నష్టం వాటిల్లింతే సహించేది లేదని అన్నారు. నిర్వాహకులు గాని మిల్లర్లు గాని రైతులను ఇబ్బందులకు గురి చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

రైస్ మిల్లర్లు అవకతవకలకు పాల్పడితే పీడియాక్టివ్ కింద కేసు నమోదు చేసి మిల్లును సీజ్ చేస్తామని హెచ్చరించారు. శాయంపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో 62 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను 16 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. రైతులకు సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలను అధికారుల సమక్షంలో అందించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రోకుల ప్రవీణ్ కుమార్ ఎంపీడీవో ఫణింద్ర మండల ఇన్చార్జి ఏవో శ్రీనివాస్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు బుచ్చిరెడ్డి పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి వైస్ చైర్మన్ రవీందర్ ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాజీ జెడ్పిటిసి చక్రపాణి మాజీ సర్పంచులు రాజిరెడ్డి ప్రకాష్ రెడ్డి నాయకులు రఘుపతి రెడ్డి రవి కుమారస్వామి రమేష్ రాజేందర్ భాస్కర్ కుమార్ రాజ్ కుమార్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -