Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్24 గంటల్లో హత్య కేసును ఛేదించిన పోలీసులు

24 గంటల్లో హత్య కేసును ఛేదించిన పోలీసులు

- Advertisement -

నవతెలంగాణ – కొత్తూరు
కొత్తూరు మున్సిపాలిటీలోని వింటేజ్ వెంచర్ లో జరిగిన హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. బుధవారం నిందితుడిని పట్టుకొని కటకటాల్లోకి తరలించారు. సిఐ నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం… బీహార్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ సంషుల్ (31) గత కొంతకాలంగా కొత్తూరులో నివాసం ఉంటూ  టైల్స్ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన నిందితుడు గంగా ప్రసాద్ బాగేల్ (33) సైతం తాపీ మేస్త్రి పనులు చేసుకుంటూ కొత్తూరులో భార్యా పిల్లలతో కలిసి  ఉంటున్నాడు. వీరి ఇరువురు పక్కపక్క నే పనులు చేసుకుంటూ ఉండేవారు. మృతుడు తరచుగా గంగా ప్రసాద్ వద్దకు వెళ్లి పనులు సరిగా చేయాలంటూ అతనితో గొడవపడేవాడు.

సోమవారం ఉదయం సైతం అదే విధంగా గొడవ పెట్టుకోవడంతో నిందితుడు అతడని తల పగలగొడతానని బెదిరించాడు. అతని పనులకు విసిగిపోయిన అతడు ఇతనిపై ఎలాగైనా పగ తీర్చుకునేందుకు సమయం కోసం వేచి చూస్తూ ఉన్నాడు. సోమవారం సాయంత్రం బయటికి వెళ్లి వచ్చే సమయానికి మృతుడు ఇంటి పైన ఉండి ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. అతడ్ని చూసిన గంగా ప్రసాద్ రగిలిపోయి ఇతని ఎలాగైనా మట్టు బెట్టాలని అనుకున్నాడు. తిరిగి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అతని భార్య పిల్లలు, చుట్టుపక్కల వారు పడుకున్నాక అందాజా ఒంటిగంట సమయంలో అతని ఇంటి పైకి వెళ్లాడు. కిచెన్ రూమ్ లో ఒక్కడే పడుకొని ఉండడాన్ని గమనించిన అతడు కిందికి వచ్చి రోడ్డు పక్కన ఉన్నటువంటి బండరాయిని తీసుకొని వెళ్లి అతని తలపై మోది హత మార్చాడు. మృతుని సడ్డకుడు సద్దాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లోనే నిందితుడు పట్టుకొని కటకటాల్లోకి తరలించారు. 24 గంటల్లో  కేసును చేదించిన పోలీసులను ఉన్నత అధికారులు, స్థానికులు సైతం అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -