Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తక్షణ ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలి

తక్షణ ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలి

- Advertisement -

– గీత కార్మికుడికి గాయాలు
నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణ ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలి అని కల్లుగీత కార్మిక సంఘం యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కోల వెంకటేష్ అన్నారు. బుధవారం, యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 10 గంటలకు గీత కార్మికుడు ఆరే చిన్న మల్లేష్  వయసు 50 సంవత్సరాలు తాటి చెట్టు ఎక్కి గీత వేయిచుండగా ప్రమాదవశాత్తు తాటిచెట్టు పై నుండి కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. ఇతనిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ భువనగిరి తీసుకువెళ్లారు. అనంతరం చిన్న మల్లేష్ ను కోల వెంకటేష్ పరామర్శించారు. రావాల్సిన ఎక్సిగ్రేషన్ మంజూరు చేయాలని  ఎక్సైజ్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో రామోజీపేట గౌడ సంఘం కులస్తులు కోక్కల కొండ యాదగిరి, ఆరే స్వామి, కోల కొమురయ్య, ఆరె మధు, కోల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -