రేపు జన్మదిన వేడుకలు, అన్నదానం
బండ్ల ఊరేగింపు
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని ఇసన్నపల్లి(రామారెడ్డి) లో వెలిసిన శ్రీ కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు 4వ రోజు ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం సంతతధారాభిషేకం, సింధూర పూజ, డోలారోహణం, (తొట్లే) సాయంత్రం బండ్ల ఊరేగింపు చూపరులను ఆకట్టుకుంది. భద్రకాళి పూజ, పల్లకి సేవలను నిర్వహించారు. సందర్శకులకు ఆలయ కమిటీ ఏర్పాట్లను చేసింది. అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మక్కులు తీర్చుకున్నారు. ఓం ఓం భైరవ స్మరణ ఆలయం మారుమోగింది. కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రభు రామచంద్రం, పూజారులు శ్రీనివాస శర్మ, వంశీ శర్మ, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, నాగరాజు, రంజిత్, ఇరు గ్రామాల ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న కాలభైరవుడి ఉత్సవాలు
- Advertisement -
- Advertisement -



