పిల్లలకు వడ్డించిన సీడీపీఓ మమత
నవతెలంగాణ – మిర్యాలగూడ
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అంగన్వాడీ కేంద్రాలలో ప్రతి బుధవారం ఎగ్ బిర్యానీ అంగన్వాడీ పిల్లలకు వడ్డించాలని ఆదేశాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మిర్యాలగూడ ఐసీడిఎస్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని ఇస్లాంపురం సెక్టర్ పరిధిలో గల విద్యానగర్ 1 అంగన్వాడి కేంద్రాన్ని సిడిపిఓ రేఖల మమత సందర్శించింది. ఈ సందర్బంగా అంగన్వాడి కేంద్రంలోని ఎగ్ బిర్యానీ భోజనాన్ని పిల్లలకు తనే స్వయంగా వడ్డించి, ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ప్రతి బుధవారం గర్భిణీలు, బాలింతలు, ప్రీస్కూల్ పిల్లలకు ఎగ్ బిర్యానీ భోజనాన్ని పెట్టవలసిందిగా తెలిపారు. ధీని వలన బెనిఫిషర్ సంఖ్య పెంచుకోవచ్చు అలాగే బెనిఫిషర్స్ కూడా ఎంతో ఆనందిస్తారన్నారు.
అంగన్వాడి కేంద్రాలలో అందించే పోషకాహారాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ కె. నాగమణి బ్లాక్ కో ఆర్డినేటర్ కవిత అంగన్వాడీ టీచర్ సిహెచ్.నర్మద, అంగన్వాడి సహాయకురాలు డి.చంద్రకళ ఇతరులు పాల్గొన్నారు.



