Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లింగరాజు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత..

లింగరాజు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత..

- Advertisement -

సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధిత కుటుంబానికి కుంభం శ్రీనివాస్ రెడ్డి భరోసా… 
నవతెలంగాణ – మునుగోడు

ఈనెల 10వ తేదీ రాత్రి మండలంలోని జమస్తాన్ పల్లి  గ్రామంలో ప్రమాదవశాత్తు నివాసం ఉంటున్న గుడిసె దగ్ధమై సర్వం కోల్పోయి, కట్టుబట్టలతో రోడ్డున పడ్డ చెక్క లింగరాజు లక్ష్మి దంపతుల కుటుంబానికి ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి రూ. 10వేల ఆర్థిక సహాయాన్ని అందించి వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా కుంభం శ్రీనివాస్ రెడ్డికి బాదితులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు పంతంగి పద్మ స్వామి, ముంత యాదగిరి, సీనియర్ జర్నలిస్ట్ జాజుల స్వామి గౌడ్, నాయకులు అందుగల భాస్కర్, జాజుల శంకర్, అందుగుల శ్రీను, పగిళ్ల సైదులు, ముంత హేమంత్, జినుకుంట్ల ముత్యాలు, అందుగుల నరసింహ, పంతంగి వెంకన్న, జాజుల రవి, ముంత మీరన్ కుమార్, అందుగుల పరమేష్, జాజుల కార్తీక్ తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -