Wednesday, November 12, 2025
E-PAPER
Homeకరీంనగర్విద్యార్థుల ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి..

విద్యార్థుల ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి..

- Advertisement -

  • – మెరుగైన విద్య అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..

– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..

నవతెలంగాణ వేములవాడ:

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన తెలిపారు. బుధవారం వేములవాడ మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే గర్ల్స్ స్కూల్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల హక్కులు,విద్య ప్రాముఖ్యత,బాల్య వివాహాల నివారణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను తప్పక చదివించాలన్నారు. ఎవరినీ పనులకు పంపకూడదని సూచించారు. పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.ప్రభుత్వం విద్యా రంగంలో విస్తృత మార్పులు తీసుకువస్తోందని, పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని ఆయన వివరించారు. రెసిడెన్షియల్ విద్యార్థుల కోసం 40% డైట్ చార్జీలు, 200% కాస్మోటిక్ చార్జీలను పెంచడం, అలాగే కామన్ డైట్ మెన్యూ ప్రవేశపెట్టడం వంటి నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు.

అదనంగా 11 వేల టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో నియమించామని, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. ఐటీఐ కళాశాలలను రతన్ టాటా కంపెనీతో అనుసంధానం చేసి అడ్వాన్స్ ట్రేడ్ సెంటర్లుగా మార్చుతున్నామని అన్నారు.

విద్యా వ్యవస్థను సమూలంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం 200 కోట్లతో 20–25 ఎకరాల్లో యంగ్ ఇండియా సమీకృత గురుకుల నిర్మాణం చేపట్టిందని ఆది శ్రీనివాస్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్, ఏసిడిపిఓ సుచరిత, కేజీబీవీ కోఆర్డినేటర్ పద్మజ, సూపర్వైజర్ శంకరమ్మ, ఎల్సిపిఓ అంజయ్య, కేజీబీవీ ప్రిన్సిపల్, ఐసిపిఎస్ చైల్డ్ లైన్ సిబ్బంది తో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -