డిసిపి ఆకాంక్షయాదవ్
నవతెలంగాణ – భువనగిరి
రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని డీసీపీ అకాంక్షన్‌యాదవ్ పేర్కొన్నారు. బుధవారం భువనగిరి ఏసీపీ డివిజన్ పరిధిలో రౌడీషీటర్లకు పోలీస్‌స్టేష న్ లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రస్తుత కుటుంబ పరిస్థితులు, జీవన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. డీసీపీ మాట్లాడుతూ గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారు మంచి ప్రవర్తనతో జీవించాలన్నారు. శాంతి భద్రతలకు, ప్రజల స్వేచ్ఛ, హక్కులకు భంగం కలిగిస్తే చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే పీడీయాక్టు పెడతామన్నారు.
ప్రతీ ఆరు నెలలకు ఒకసారి చెడు ప్రవర్తన కలిగిన వారిని బైండోవర్ చేస్తామని, వీరిపై పోలీసు నిఘా ఉంటుందన్నారు. బైండోవర్ కాలంలో నేరాలకు పాల్పడితే జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందన్నారు. డివిజన్ వ్యాప్తంగా 200 మంది గాను 84 మంది హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏఎస్పీ కె. రాహుల్‌రెడ్డి, సీఐ రమేష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.



