Thursday, November 13, 2025
E-PAPER
Homeజిల్లాలువాగులో పడి వృద్ధుడు మృతి

వాగులో పడి వృద్ధుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ కనగల్: కనగల్ వాగులో పడి అదే గ్రామానికి చెందిన చిట్టిమల్ల పెద్దులు తండ్రి గోపయ్య (65) అనే వ్యక్తి మృతి చెందాడు. కనగల్ ఎస్సై రాజీవ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తన వ్యవసాయ భూమి వద్ద వడ్లు ఎండబోసి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి వాగులో పడి మృతి చెందినట్లు తెలిపారు.

అతనికి ఈత రాకపోవడం వల్ల నీటిలో మునిగి చనిపోగా ఆరోజు నుండి మృతుడు కనిపించుట లేదని అతని కుటుంబ సభ్యులు అన్ని చోట్ల వెతుకుతుండగా బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయం లో పశువుల కాపరులు కనగల్లులోని చెట్ల శంకరయ్య పొలం కింద నుండి పోతున్న వాగు నీటిలో పెద్దలు శవని చూసి అట్టి విషయాన్ని పశువుల కాపరులు పెద్దులు కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపారు. అట్టి వ్యక్తి శవం పెద్దలు దేనిని ఖరారు చేసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి అట్టి మృతదేహాన్ని పోస్ట్మాస్టర్ నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వాగులో ఇసుక కోసం జెసిపిలతో తీసిన లోతైన గుంతలలో పడి పెద్దలు మరణించినట్టు స్థానికులు మాట్లాడుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -