తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య, మాజీ జెడ్పిటిసి ఐత కోమల రాజిరెడ్డి
నవతెలంగాణ – మల్హర్ రావు.
క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య, మాజీ జెడ్పిటిసి ఐత కోమల-రాజిరెడ్డి అన్నారు. గడ్డం శ్యాం సుందర్ స్మారకార్థం ఎంపీఏల్ డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నీని ప్రేoడ్స్ యూత్ నిర్వహించారు. రెండు వారాలపాటుగా కొనసాగిన ఈ పోటీల్లో ప్రథమ బహుమతి కొయ్యుర్ లైన్స్ లేవన్ రూ.30 వేలు నగదు, టోర్నీ, ద్వితీయ బహుమతి ప్రవీణ్ లేవన్ ఓజి రూ.20 వేలు నగదు, తృతీయ బహుమతి మహి త్రిబుల్ త్రి రూ.10 వేలు నగదు బహుమతులను బుధవారం అందజేశారు. బహుమతులు సహకరించిన మాజీ జెడ్పిటిసి రాజిరెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య, లింగంపల్లి శ్రీనివాసరావు అండ్ సన్స్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్,మంథని మార్కెట్ డైరెక్టర్ గడ్డం పోచయ్య, మాజీ సర్పంచ్ సిద్ధి లింగమూర్తి, యూత్ డివిజన్ నాయకుడు రాహుల్, మెట్టు రాములు, పొసమ్మ, యువత,క్రీడాకారులు పాల్గొన్నారు.
క్రీడల్లో గెలుపు ఓటములు సహజం.
- Advertisement -
- Advertisement -



