నవతెలంగాణ – హైదరాబాద్: నేడు భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న అవార్డు గ్రహీత డా. భీమ్ రావు అంబేద్కర్ 134వ జయంతి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముకులు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఇందులో భాగంగా.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నివాళులు అర్పిస్తూ.. ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ఏర్పడిందని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ సాధ్యమైందని అన్నారు. అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బీఆర్ఎస్ పాలన కొనసాగించిందని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో దళిత బంధు, సహా అనేక పథకాలను అమలు చేశామని గుర్తు చేశారు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాలను కొనసాగించలేక పోతుందని, అనగారిన వర్గాలకు ఉపయోగపడే ఆ పథకాలను కొనసాగించాలని అన్నారు. అప్పుడే అంబేద్కర్ కు నిజమైన నివాళి అర్పించినవారిమి అవుతామని కేసీఆర్ తన ప్రకటనలో వెల్లడించారు.
అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించిన మాజీ సీఎం కేసీఆర్
- Advertisement -
RELATED ARTICLES