Thursday, November 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరైతుల సమస్యలను పరిష్కరించండి

రైతుల సమస్యలను పరిష్కరించండి

- Advertisement -

షరతుల్లేకుండా సీసీఐ కొనుగోలు చేసేలా చూడండి
మంత్రి తుమ్మలను కోరిన రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు
రైతులకు ఇబ్బందులు రాకుండా చూస్తాం : మంత్రి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనీ, షరతుల్లేకుండా సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతు స్వరాజ్య వేదిక కోరింది. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో విస్సా కిరణ్‌ నేతృత్వంలో రైతు స్వరాజ్య వేదిక బృందం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావును కలిసింది. ఈ సందర్భంగా విస్సా కిరణ్‌ పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ…రైతు స్వరాజ్య వేదిక నాయకులు లేవనెత్తిన సమస్యలకు సందేహాలను నివృత్తి చేయాలని మార్కెటింగ్‌ అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్‌లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహాయ సహకారాలు లేకపోవడంతో పత్తి కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, సోయాబిన్‌లో కూడా రంగుమారిన పంటను కొనుగోలు చేయడానికి వీలుగా కేంద్రాన్ని కోరామని తెలిపారు. మొక్కజొన్న పంటను రాష్ట్రం స్వంత నిధులతో సేకరిస్తున్నదనీ, రైతుల నుంచి విజప్తి రాగానే ఎకరానికి ఉన్న 18 క్వింటాళ్ల పరిమితిని పెంచి 25 క్వింటాళ్లకు పెంచామని గుర్తుచేశారు. పంటనష్టం నివేదికలో పొరపాట్లు లేకుండా గ్రామపంచాయతీలలో నోటీస్‌ బోర్డుల్లో ఉంచే విధంగా అధికారులకు ఆదేశాలిస్తామనీ, రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే మరొకసారి వెళ్లి పంటలను పరిశీలించి నమోదు చేసేలా అధికారులను ఆదేశిస్తామని హామీనిచ్చారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా రైతుల వద్ద నుంచి పంటల కొనుగోళ్లు చేసేవిధంగా అన్ని రకాల జాగ్రత్తలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని వారికి మంత్రి భరోసానిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -