Thursday, November 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయందక్షిణ మధ్య రైల్వేతో ఐఐటీ ఒప్పందం

దక్షిణ మధ్య రైల్వేతో ఐఐటీ ఒప్పందం

- Advertisement -

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌), ఇండియన్‌ రైల్వేస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సిగల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌ (ఇరిసెట్‌)కు సంబంధించి సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీవోఈ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్‌ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లోని రైల్‌ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ సిగల్‌, టెలికాం ఇంజనీర్‌ పీవీ మురళీ కృష్ణ, ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి సమక్షంలో తేజ్‌ ప్రకాష్‌ అగర్వాల్‌, విజయ్ సెర్వాల్‌, ప్రొఫెసర్‌ జి నరహరి శాస్త్రి సంతకాలు చేశారు.

దక్షిణ మధ్య రైల్వే సాంకేతిక పురోగతి కవాచ్‌ పర్యావరణ వ్యవస్థలో నిర్వహణ, అప్‌గ్రేడబిలిటీ, బహుళ విక్రేతల ఆవశ్యకతను గుణనీయంగా పెంచుతుంది. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌ అంతటా స్కేలబుల్‌ మరియు సమర్థవంతమైన అమలుకు మార్గం సుగమం చేస్తుందని ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎ శ్రీధర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు దక్షిణ మధ్య రైల్వే, సీవోఈ, ఇరిసెట్‌, ఐఐటీ హైదరాబాద్‌తో భాగస్వామ్యం ఏర్పరచుకున్నాయి. ఎంబెడెట్‌ సిస్టమ్స్‌, సైబర్‌ ఫిజికల్‌ సిస్టమ్స్‌, కమ్యూనికేషన్‌ ప్రోటోకాల్స్‌, సిస్టమ్‌ లెవల్‌ హార్డ్‌వేర్‌ ఇంటిగ్రేషన్‌లో ఇన్‌స్టిట్యూట్‌ నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటాయని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -