Thursday, November 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంటిస్టాలో విత్తన నాణ్యత భరోసా,ఇస్టా గుర్తింపుపై శిక్షణ

టిస్టాలో విత్తన నాణ్యత భరోసా,ఇస్టా గుర్తింపుపై శిక్షణ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాజేంద్రనగర్‌లోని తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ, అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రం(టీఐఎస్‌టీఏ) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు విత్తన నాణ్యత భరోసా, ఇస్టా గుర్తింపుపై ప్రభుత్వ, ప్రయివేటు విత్తన రంగ సంస్థ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణను ఇస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని తెలంగాణ సీడ్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ డైరెక్టర్‌ డాక్టర్‌ కేశవులు, ఇస్టా విత్తన పరీక్ష సలహాదారులు జీవీ.జగదీశ్‌ మంగళవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన సీడ్‌ సర్టిఫికేషన్‌ అథారిటీల నుంచి, ఉద్యాన యూనివర్సిటీ నుంచి, అదేవిధంగా, రాష్ట్ర వ్యవసాయ శాఖ నుంచి అధికారులు, ప్రయివేటు విత్తన కంపెనీల నుంచి మొత్తం 30 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ముఖ్యంగా, విత్తన నమూనాల సేకరణ, అధునాతన విత్తన పరీక్ష పద్ధతులు, అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ గుర్తింపు పొందేందుకు పాటించాల్సిన నియమ నిబంధనలపై శిక్షణ ఇచ్చారు. బుధవారం విత్తనాల నమూనాల సేకరణపై ప్రత్యేకమైన ప్రాక్టికల్‌ సెషన్స్‌ నిర్వహించారు. విదేశాలకు విత్తన ఎగుమతులు చేయడానికి కావాల్సిన ఆరంజ్‌ అంతర్జాతీయ విత్తన ఎగుమతి ఈ-సర్టిఫికెట్ల జారీపై స్విట్జర్‌లాండ్‌ ప్రతినిధులతో ప్రత్యేక వెబినార్‌ నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -