నవతెలంగాణ – అమరావతి: రత్-యూరోపియన్ యూనియన్ (ఈయూ) బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సుస్థిరాభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ ప్రాముఖ్యతపై సీఎం కీలక ప్రసంగం చేశారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ను ‘గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ’గా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, అర్మేనియా తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరిగిపోవడం వల్ల ప్రకృతి విపత్తులు విధ్వంసం సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. “క్లౌడ్ బరస్ట్ వంటి ఘటనలతో నగరాలు నీట మునుగుతున్నాయని అన్నారు. ఒకేచోట 40 సెంటీమీటర్ల వర్షపాతం కురవడం వంటి తీవ్ర పరిణామాలు గ్లోబల్ వార్మింగ్ వల్లే సంభవిస్తున్నాయని ఆయన అభిప్రాయాపడ్డారు. ఈ ఉత్పాతాలను ఎదుర్కోవాలంటే మనమంతా కలిసి గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేయాలి” అని పిలుపునిచ్చారు.
మనమంతా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేయాలి: సీఎం చంద్రబాబు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



