Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విజయవంతంగా కొనసాగిన బీసీల ధర్మ పోరాట దీక్ష

విజయవంతంగా కొనసాగిన బీసీల ధర్మ పోరాట దీక్ష

- Advertisement -

నవతెలంగాణ – కంటేశ్వర్
బీసీ లకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ల ను కల్పించాలనని రాష్ట్ర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో వివిధ అష్టాదశ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా శ్రీ జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు నాయకత్వలో గురువారం రోజున మండల, జిల్లా కేద్రాలలో బీసీల ధర్మ పోరాటదీక్ష కార్యక్రమనికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈరోజు నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్ పోరాట దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ… బీసీలకు రాజకీయ విద్య ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు వెంటనే కల్పించాలని లేకపోతే బీసీ ఉద్యమాన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్తామని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వెంటనే అమలుపరిచి తమ నిజాయితీని నిరూపించుకోవాలని అన్నారు.

ఈ సందర్భంగా బిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్స ఆంజనేయులు మాట్లాడుతూ…. జనాభాలు 56% బీసీలు ఉన్నాగాని ఈ రాష్ట్ర ప్రభుత్వం 42% ఇచ్చినా కూడా దానికి సంతోషపడ్డ కొందరు అగ్రవర్ణాల దురహంకాలు కేసులు వేసి రిజర్వేషన్లను ఆపివేయడం అన్యాయం అన్నారు. వెంటనే ఈ కేసులను వెనుకకు తీసుకొని డిమాండ్ చేసారు. రాష్ట్ర కార్యదర్శి ఆకుల ప్రసాద్ మాట్లాడుతూ… బీసీల్లో చైతన్యం వచ్చిందని ఇక బీసీలను ఆపేశక్తి ఏది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తో పాటు బుస్స ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, దర్శనం దేవేందర్, కరిపె రవిందర్,  మాడవేడి వినోద్ కుమార్ కొయ్యడ శంకర్, శ్రీలత, చంద్రమోహన్, బగ్గలి అజయ్, చంద్రకాంత్ వాసం జయ ఆర్టీసీ శ్రీనివాస్ నగేష్, బాలన్న ,దయానంద్ ,గోపాల్, సురేందర్, అనిల్ ,నర్సింలు, శ్రీనివాస్ ,రవి, ధర్మపురి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -