నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నిజాంబాద్ జిల్లా 3వ మహాసభలు నిజామాబాద్ రూరల్ మండలం కొత్తపేటలో జరిగిన విషయం తెలిసిందే. ఆ సభలో ఎన్నుకున్న నూతన కమిటీ ఎన్నికను పెద్ది వెంకట్రాములు ప్రకటించారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా పెద్ది వెంకట్రాములు, జిల్లా అధ్యక్షుడిగా కోయడ నర్సింలు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా సిదుగు శేఖర్ గౌడ్, జిల్లా కోశాధికారిగా శ్రీరామ్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులుగా కోటగిరి రామ గౌడ్ , సేపూరు సాయ గౌడ్లను, జిల్లా సహాయ కార్యదర్శిలుగా సురేందర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సుదర్శన్, మరియు వీరితో కలిపి 23 మందిని జిల్లా కమిటీగా ఎన్నుకున్నట్టుగా ప్రకటించారు.
భవిష్యత్తులో నూతన కమిటీ చురుకుగా, నిస్వార్ధంగా, సమస్యల పోరాటాలు చేసి కల్లుగీత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తారని ఆశిిస్తున్నాామన్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ… భవిష్యత్తులో కూడా గత అనుభవాలను తీసుకొని గీత కార్మికుల సంక్షేమం, గీత వృత్తి రక్షణ కోసం నిస్వార్థంగా పనిచేస్తుందనీ.. పని చేయాలని నూతన కమిటీకి సూచించారు. అలాగే జిల్లా నూతనఅధ్యక్ష- కార్యదర్శులు ..కోయడ నరసింహులు- సిదుకు శేఖర్ గౌడ్ లుమాట్లాడుతూ.. తమపై పెట్టిన బాధ్యతలను నిస్వార్ధంగా శక్తి వంచన లేకుండా సమస్యల పోరాటానికి సిద్ధంగా ఉంటామని, పోరాడుతామని, గీత కార్మికులను ఐక్యం చేస్తూ ఐక్య పోరాటాలు కూడా నిర్వహిస్తామని గౌడగీత కార్మిక మిత్రులందరికీ కలుపుకొని నడుస్తామని చెప్పారు. అలాగే ఈనెల 28, 29, 30 తేదీలలో సూర్యాపేటలో జరిగే 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్మిక సోదరులకు నూతన అధ్యక్ష కార్యదర్శులు పిలుపునిచ్చారు.


