151 అనాధ శవాలకు అంతక్రియలు
నవతెలంగాణ – కంఠేశ్వర్
అనారోగ్యంతో వారం రోజుల క్రితం అనాధగా చనిపోయిన పెద్దాయన దేహం పూర్తిగా చిమలు పట్టి ఉంది. ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో బిక్షాటన చేస్తు బ్రతుకేవాడని ఆరోగ్యం సహకరించగా రోడ్డు పై నిస్సహాయక స్థితిలో పడి ఉండగా పోలిసులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మరణించాడు తన వారేవారు లేకపోవడం రాకపోవడంతో ఆర్మూర్ పోలిస్ సిబ్బంది అనుమతితో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతిమ సంస్కారాలు గురుువారం దేవి థియేటర్ పక్కన గల సార్వజనిక్ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించామని ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సాయిబాబు తెలిపారు. ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ద్వారా ఇప్పటి వరకు నిర్వహించిన అనాధ శవాల అంత్యక్రియలకి సంబంధించి నేటితో 151 పూర్తయ్యాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ సభ్యులు చందా జగన్ మోహన్, నరేష్ రెడ్డి, ఆర్మూర్ పోలిస్ సిబ్బంది వినయ్ తదితరులు పాల్గొన్నారు.
అనాధ శవానికి అంతక్రియలు చేసిన ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



