Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు ఉత్పత్తిదారుల సంస్థల వ్యాపార వైవిధ్యీకరణ, సామర్థ్య నిర్మాణ శిక్షణా 

రైతు ఉత్పత్తిదారుల సంస్థల వ్యాపార వైవిధ్యీకరణ, సామర్థ్య నిర్మాణ శిక్షణా 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
గురువారం కామారెడ్డి పట్టణంలోని అమృత గ్రాండ్ హోటల్‌లో రైతు ఉత్పత్తిదారుల సంస్థల (FPOs) వ్యాపార వైవిధ్యీకరణ (Business Diversification), సామర్థ్య నిర్మాణ (Capacity Building) శిక్షణా కార్యక్రమాన్ని  జిల్లా కలెక్టర్  ఆశిష్ సాంగ్వాన్  హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్‌మెంట్ ( ఐ సీఎం )  నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ( ఎన్సిడిసి ) సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ  రైతు ఉత్పత్తిదారుల సంస్థలు , కామన్ సర్వీస్ సెంటర్లు ( సి ఎస్ సి ఎస్ ) వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను రైతులు,  సహకార సంస్థలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత షేర్ క్యాపిటల్ (Free Share Capital), మేనేజ్‌మెంట్ ఖర్చుల నిధులను (Management Cost Contribution) సమర్థంగా వినియోగించుకుని ఎఫ్ పి ఓ ల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐ సి ఎం  డైరెక్టర్  గణేశన్ , ఎన్సిడిసి  రీజినల్ డైరెక్టర్  సర్దూల్ , కామారెడ్డి జిల్లా సహకార అధికారి, అలాగే  ఐ సి ఎం,  ఎన్సిడిసి   అధికారులు, ఎంపిక చేయబడిన పిఎసిఎస్   సంస్థల అధ్యక్షులు, డైరెక్టర్లు, ఎఫ్ సి ఒ  తినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -