Thursday, November 13, 2025
E-PAPER
Homeఆదిలాబాద్జన్నారంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెంటనే ఏర్పాటు చేయాలి

జన్నారంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెంటనే ఏర్పాటు చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల స్థానిక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్‌ (USFI) మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి అల్లం సాయితేజ పేర్కొన్నారు. ప్రస్తుతం జన్నారం మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల  ప్రైవేట్ జూనియర్ కళాశాలల నుండి ప్రతి సంవత్సరం సుమారు 250 మంది విద్యార్థులు ఇంటర్ సెకండ్ ఇయర్ ఉత్తీర్ణులు అవుతున్నప్పటికీ, డిగ్రీ చదవడానికి తగిన ప్రభుత్వ విద్యాసౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా మారిందన్నారు.

డిగ్రీ చదువు కొనసాగించడానికి చాలా మంది విద్యార్థులు హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లి చదవాల్సి వస్తోందని, దీని వలన పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జన్నారంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పడితే ఖానాపూర్, ఉట్నూరు, మరియు పరిసర మండలాల విద్యార్థులు కూడా చదువుకోడానికి సులభం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

“ప్రతి సంవత్సరం వేల రూపాయల ఖర్చుతో ప్రైవేట్ కళాశాలల్లో చదవలేక అనేక మంది విద్యార్థులు చదువు మానేసి కూలి పనులు చేస్తున్నారు. ఇది ఒక పెద్ద సామాజిక నష్టం,” అని ఆయన పేర్కొన్నారు.జన్నారం నియోజకవర్గ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఈ సమస్యను ప్రస్తావించి తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం వెంటనే జన్నారం మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని యుఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది.తల్లిదండ్రులు, విద్యార్థుల ఆకాంక్షలను పరిగణంలోకి తీసుకొని  త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -