సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా కౌన్సిల్ సభ్యులు మారేడు శివశంకర్
నవతెలంగాణ – తిమ్మాజిపేట
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ లక్ష్మణాచారి భవన్, సిపిఐ జిల్లా కార్యాలయంలో సిపిఐ దశబ్ది కరపత్రాలను సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మారేడు శివశంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1925, డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ నగరంలో ఆవిర్భవించిందన్నారు. 2025 డిసెంబర్ 26 తేదీ నాటికి భారత కమ్యూనిస్టు పార్టీ భారత దేశ గడ్డ పై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా 2025,12, 26 ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగే భారీ బహిరంగసభను విజయవంతం చేయుటకు మూడు జాతాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 నుండి 21 వరకు గద్వాల నుండి కొత్తగూడెం వరకు నిర్వహించే ప్రచార జాతాలను జయప్రదం చేయాలని కోరారు.
రెండవ జాత రథసారధిగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లికంటి సత్యం ఎమ్మెల్సీ ల ఆధ్వర్యంలో 2వ జాత గద్వాల జిల్లా కేంద్రంలో తేదీ,15, 11, 2025 ఉదయం 11 గంటలకు ప్రారంభమై ఉమ్మడి జిల్లా తిరుగుతూ నాగర్ కర్నూలు జిల్లాకు 17న ఉదయం 10 గంటలకు తిమ్మాజీపేట మండలానికి సిపిఐ జాత చేరుకుంటుందన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం కేంద్రానికి వస్తున్నందున తిమ్మాజిపేట మండలంలోని వివిధ గ్రామాలు తాడూరు మండలంలోని బాలన్ పల్లి, సిరసవాడ, ఐతోలు, గ్రామాల ప్రజలు ఉదయం 9 గంటలకు అందరూ సకాలంలో చేరుకొని సిపిఐ జాతకు స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. తిమ్మాజిపేట నుండి బిజినపల్లి, నాగర్ కర్నూల్, మండలాలకు ఉదయం 12 గంటలకు చేరుకుంటుందని తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మీటింగ్ తర్వాత మధ్యాహ్నం భోజనం తెలకపల్లి మండలంలో ఉంటుందని అన్నారు. ఆ తర్వాత అచ్చంపేట మండలానికి చేరుకుంటుంది. అచ్చంపేట మండలం లోనికి మధ్యాహ్నం మూడు గంటల వరకు మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత నల్గొండ జిల్లా డిండి మండలానికి సాయంత్రం ఐదు గంటలకు సభ బస రాత్రి అక్కడే ఉంటుందని తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం కేంద్రంలో వందేళ్ళ సిపిఐ జాతకు ఘన స్వాగతం పలికే విజయవంతం చేయాలని వివిధ మండలాల నుంచి వివిధ గ్రామాల ప్రజలు సానుభూతిపరులు ప్రజాస్వామ్యవాదులు లౌకిక శక్తులు అందరూ కలిసి స్వాగతంపల్లి సి విజయవంతం చేయాల్సిందిగా మారేడు శివశంకర్ కోరారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీచారి, నాగర్ కర్నూల్ పట్టణ సిపిఐ సహాయ కార్యదర్శి కొత్త రామస్వామి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాంగట్ల వెంకటస్వామి, చిన్నపాగ శ్రీనివాసులు, భారత జాతీయ మహిళా సమాఖ్య ఎన్ఎఫ్ఐ డబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షురాలు మారెడు అనూష , చిన్నపాగ శాంతమ్మ, కార్మికులు బిరుదు, నారాయణ, చిన్న కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.



