Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

- Advertisement -

దళారుల చేతిలో రైతులు మోసపోవద్దు: ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

మండలంలోని నెల్లికుదురు శ్రీరామగిరి పిఎసిఎస్ మునిగల వీడు, ఐకెపి సెంటర్ మునిగల వీడు గ్రామంలోని సిరివెన్నెల ఆధ్వర్యంలో  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ తెలిపారు. గురువారం నెల్లికుదురు పిఎసిఎస్ పర్సన్ ఇంచార్జి జాకోజ్ మనోహర్ రావు, శ్రీరామగిరి పిఎసిఎస్ చైర్మన్ గుండా వెంకన్న, ఐకెపి ఎపిఎం నరేంద్ర కుమార్ తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు రైతులు ఘనసాగతం పలికారు అనంతరం వారు మాట్లాడుతూ ..రైతులు మహబూబాబాద్ జిల్లాలో వరి సాగు ఈ సంవత్సరం ఎక్కువ చేశారని దాని దిగుమతి కూడా వచ్చిందని అన్నారు.

రైతులు ఒడ్లు ఆరబెట్టుకొని తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కాండాలు నిర్వహించి మిల్లర్లకు తరలించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతుల పట్ల నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. వర్షాలు అనుకోకుండా వస్తే వెంటనే వడ్లు తడవకుండా భద్రపరుచుకునేందుకు నిర్వాహకులు టర్బాలిన్లు ఇస్తారని వాటిని తీసుకొని రైతులు వదలను కాపాడుకోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు రైతులకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు ఉండే విధంగా చూడాలని అన్నారు రైతులు వడ్లను శుభ్రపరచుకునేందుకు మిషన్ కూడా అందుబాటులో ఉందని వాటిని సద్వినియోగం చేసుకొని కొనుగోలు కేంద్రాలు అమ్ముకోవాలని అన్నారు.

దళారుల చేతిలో తూకంలో మోసం పోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని తెలిపారు. వడ్ల రకం ఏ గ్రేడ్ 2389 మరియు సి గ్రేడ్ ధర 2369 రూపాయలు రైతులకు చెల్లిస్తారని అన్నారు ప్రభుత్వం ఈసారి సన్న ధాన్యానికి ఈ డబ్బుతో పాటు బోనస్ డబ్బులను కూడా ముందుగానే చెప్పారు. నిర్వాహకులు తూకంలో గానీ తేమ శాతం లో గాని రైతులను మోసం చేసి ఇబ్బందుల గురి చేస్తే ఊరుకునే పరిస్థితి ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ చందా నరేష్, ఏఎంసీ వైస్ వైస్ చైర్మన్ బట్టు నాయక్, సిరివెన్నెల మహిళా సంఘం అధ్యక్షులు ఎండి అరిఫ్ , సునీత , రామాదేవి, ట్యాబ్ ఆపరేటర్ జిల్లా కవిత, నాయకులు బాలాజీ నాయక్ ప్రభాకర్ గౌడ్ మద్ది రాజేష్ కాలేరు మల్లేశంపంచాయతీ కార్యదర్శి రాజేష్ వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -