Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మానసిక సమస్యలపై విద్యార్థులకు అవగాహన సదస్సు

మానసిక సమస్యలపై విద్యార్థులకు అవగాహన సదస్సు

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మానసిక సమస్యలపై, మాదక ద్రవాల వినియోగ ప్రభావంపై గురువారం వైద్య ఆరోగ్య, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో అవగాహన కల్పించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగా కిషన్ తెలిపారు. ఈ అవగాహన సదస్సుకు  హాజరైన జిల్లా మానసిక వైద్యాధికారి డా.రమణ మాట్లాడుతూ  ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం బేధాలను, చికిత్స విధానాలను తెలియజేస్తూ విద్యార్థులకు టీనేజ్ వయస్సులో వచ్చే అవరోధాలను కూలంకుశంగా వివరించారు. ప్రణాళిక బద్ధంగా విద్యార్థులు తమ చదువును కొనసాగించి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రపంచంలో ఎక్కువమంది టీనేజీ యువత రోడ్డు ప్రమాదాలతో మరణిస్తూ మొదటి స్థానంలో ఉండగా, డిప్రెషన్ బారిన పడి ఒంటరితనానికి లోనై ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనలతో మరణిస్తున్నారని తెలిపారు.

మానసిక సమస్యలను ఎదుర్కోలేక చాలామంది యువత ముఖ్యంగా విద్యార్థులు చెడు వ్యసనాలకు మత్తుపదార్థాలకు మొబైల్ వినియోగానికి, నిద్రలేమికి గురవుతున్నారని తెలిపారు. విద్యార్థులకు గాని వారి కుటుంబ సభ్యులకు గానీ మానసిక సమస్యలు తలెత్తితే వెంటనే ప్రభుత్వాసుపత్రిలో మానసిక వైద్యులను సంప్రదించాలని లేనియెడల టెలి మానస్ ఉచిత టోల్ ఫ్రీ 14416 ను సంప్రదించాలని సూచించారు.  ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ మాట్లాడుతూ టీనేజీ లో విద్యార్థులు మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారని, అటువంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. కామారెడ్డి చుట్టుపక్కల గ్రామాల్లో సైతం డ్రగ్స్ బారినపడి చాలామంది యువత మానసిక సమస్యలకు గురయ్యారని తెలిపారు.

ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు విషయాలు తెలిసినా, డ్రగ్స్ సమస్యల నుండి దూరం కావడానికి చికిత్స తీసుకోవాలన్న సమాచారాన్ని 14446 కు తెలియజేయాలని వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అనంతరం మాదకద్రవ్యాల నిరోధానికి ఉపాధ్యాయులు, విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగాకిషన్, జిల్లా సైకియాట్రిక్ సోషల్ వర్కర్ డా.రాహుల్ కుమార్, ఉపాధ్యాయులు శ్రీశైలం, నవీన్, శ్రీనివాస్, రమేష్, పోలీసు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -