నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో గురువారం అడిషనల్ కలెక్టర్ విక్టర్ రెవెన్యూ రికార్డులు పరిశీలించారు. రెవెన్యూ సదస్సులు, సాదా బైనామా దరఖాస్తుల సమస్యలు త్వరగా పూర్తి చేయాలని తాసిల్దార్ సునీతకు సూచించారు. అధికారులు రైతులకు, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు, ధ్రువపత్రాలు ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. నూతన షాపింగ్ కాంప్లెక్స్ పరిశీలన….పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ స్థలాన్ని అడిషనల్ కలెక్టర్ విక్టర్ పరిశీలించారు. వ్యాపారస్తులకు అణువుగా ఉండే విధంగా త్వరగా పనులు పూర్తి చేసి కాంప్లెక్స్ నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య, సొసైటీ చైర్మన్ భూమయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలయ్య, సొసైటీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, అధికారులు తదితరులు ఉన్నారు.
రెవెన్యూ రికార్డు పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



