నవతెలంగాణ – మిర్యాలగూడ
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం, తెలుగు భాషా బలోపేతం కోసం కాళోజి నారాయణరావు చేసిన కృషి నేటి యూవతకు స్ఫూర్తిదాయకమని సామాజిక వేత్త డాక్టర్ రాజు, గ్రంధాలయం ఉద్యమ కర్త కస్తూరి ప్రభాకర్, బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్, యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చెగొండి మురళి యాదవ్ లు అన్నారు. గురువారం కాళోజి నారాయణ రావ్ వర్ధంతి సందర్బంగా మిర్యాలగూడలోని మేరెడ్డి రాంచంద్రారెడ్డి గ్రంధాలయం లో అయన చిత్రపటానికి పూలదండ వేసి మాట్లాడారు. ఆంధ్రుల పాలనలో తెలంగాణకు జరుగుతున్న నష్టాలను పాటల రూపంలో రాసి ప్రజలను చైతన్యపరిచారు. తెలుగు భాషా పరిరక్షణ కోసం అనేక గ్రంధాలను రాసి అవహగాహన కల్పించారు. అయన ఆశయం సాధన కోసం యువత కృషి చేయాలనీ కోరారు. కార్యక్రమంలో కుమ్మరికుంట్ల సుధాకర్,లవన్, క్రాంతి, వెంకటేష్, నాగార్జున, అఖిల్, రాంబాబు, సూర్య, నాగరాజు, పవన్, మధు, విజయలక్ష్మి, మమత, గాయత్రి, చందన, సునీత తదితరులు పాల్గొన్నారు.
కాళోజిని స్ఫూర్తిగా తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



