– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కర్నాటకలో విజయవంతమైన లైసెన్స్‌డ్ సర్వేయర్ల విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణను రూపొంది స్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియా మకం పై గురువారం సచివాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐదు వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను తీసుకోబోతున్నామనీ, అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 17 వరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగు తుందని పేర్కొన్నారు. ఎంపికైన వారికి తెలంగాణ సర్వే అకాడమీలో శిక్షణ ఇస్తామని తెలిపారు. కర్ణాటకలో అమలవుతున్న లైసెన్స్‌డ్ సర్వే విధానంపై ఇటీవల ఆ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడం జరిగిందనీ, దాని ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 1999 ల్యాండ్ రెవెన్యూ చట్టంలో చేసిన సవరణలతో లైసెన్స్‌డ్ సర్వేయర్ల విధానం కర్నాటకలో 2005 నుంచి అమలుల్లోకి వచ్చిందని తెలిపారు.ఈ విధానం ద్వారా భూముల రిజిస్ట్రేషన్‌కు ముందు మ్యూటేషన్ స్కెచ్ తయారు చేయబడుతుందనీ, ప్రీ-రిజిస్ట్రేషన్ స్కెచ్‌తో కొనుగోలు చేయబోయే భూమి విస్తీర్ణం, టైటిల్ వంటి స్పష్టమైన సరిహద్దు వివరాలుంటాయని అధికారులు ి ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. ప్రస్తుతం కర్ణాటకలో 6,000 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లు, 4,000 మంది ప్రభుత్వ సర్వేయర్లు సేవలందిస్తున్నారనీ, ఒక్కో లైసెన్స్‌డ్ సర్వేయర్ నెలకు సగటున 23 దరఖాస్తులను పరిష్కరిస్తున్నారని మంత్రికి వివరించారు. భూలావాదేవీలు, భూ విస్తీర్ణాన్ని బట్టి సర్వేయర్లను నియమించాలని అధికారులకు మంత్రి సూచించారు. కర్నాటకలో దాదాపు 20 ఏండ్ల నుంచి కొనసాగుతున్న లైసెన్స్‌డ్ సర్వేయర్ల విధానం సక్సెస్ అయిందని గుర్తు చేశారు. ఈ పద్దతి వల్ల రాష్ట్రంలో భూ వివాదాలకు పరిష్కారం లభిస్తుందని పొంగులేటి ఆశాభావం వ్యక్తం చేశారు.
కర్నాటక తరహాలో లైసెన్స్‌డ్ సర్వేయర్ల విధానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES