నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై బొల్లంపల్లి గ్రామానికి చెందిన సత్తూరి ప్రసాద్ గౌడ్ నూతనంగా నిర్వహించిన పివిఆర్ ఫుడ్ విలేజ్ ను కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. యువత స్వయం ఉపాధి రంగాలలో ఎంచుకొని జీవితంలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్, వెల్దండ మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి, కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ యాదవ్, కల్వకుర్తి మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ ,మాజీ ఎంపీటీసీ వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ జయప్రకాష్, వెల్దండ సింగిల్ విండో డైరెక్టర్ వెంకటయ్య గౌడ్, జియాగూడ యాదవ సంఘం అధ్యక్షులు జంగయ్య యాదవ్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పివిఆర్ ఫుడ్ విలేజ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



