– అధ్యక్షులు గా గడ్డం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని వేదాంత పురం రక్షిత అటవీప్రాంతంలో గల వన దుర్గాంబిక సమేత వన లింగేశ్వర స్వామి ఆలయ పాలక వర్గాన్ని గురువారం ఆ గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులుగా ప్రముఖ రైతు గడ్డం వెంకటేశ్వరరావు,ఉపాధ్యక్షులు గా కూన చిన్నారావు,కోశాధికారిగా దాది వెంకటేశ్వరరావు లు ఎన్నికయ్యారు. పాలక వర్గం సభ్యులుగా సంగీత సత్యనారాయణ, ఉప్పాడ హరి బ్రహ్మానందం,కూన దుర్గారావు, నడిది లక్ష్మయ్య,గడ్డం రాముడు,పసుపులేటి నాగమణి,యలవర్తి శిరీష, దాది లక్ష్మి,కొయ్యల కమల, పైడి మంగ,దాది రాజేశ్వరి,గడ్డం వీర లక్ష్మి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా అద్యక్షులు గడ్డం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వేదాంతపురం అటవీ ప్రాంతంలో ఎన్నో తరాల పూర్వం వెలసిన శ్రీ వన దుర్గాంబికా సమేత వన లింగేశ్వర స్వామి ఆలయం పునరుద్దరణకు అహర్నిశలు కష్టపడి కమిటీ ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద కాపు తోట వెంకటస్వామి, మాజీ సర్పంచ్ సోమని శివ శంకర ప్రసాద్, పైడి లవ రాజు తదితరులు పాల్గొన్నారు.



